రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 2.30 వరకు రాష్ట్రంలో 76.43 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరంలో అత్యధికంగా 84.60, విశాఖపట్నంలో అత్యల్పంగా 65.00 శాతంగా ఉంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.
గుంటూరులో 81.93, కర్నూలులో 79.90, నెల్లూరులో 79.63, కృష్ణాలో 79.60, ప్రకాశంలో 79.31, అనంతపురంలో 78.32, చిత్తూరులో 77.88, శ్రీకాకుళంలో 76.30, తూర్పు గోదావరిలో 72.00, పశ్చిమ గోదావరిలో 70.75, కడపలో 68.42 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: