ETV Bharat / city

మహాపాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఉత్తర్వులు - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

dgp rajendranathreddy
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
author img

By

Published : Sep 9, 2022, 7:08 AM IST

రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు.

ఉత్తర్వు సారాంశమిదీ.. ‘మీరు సెప్టెంబర్‌ 12 నుంచి మహాపాదయాత్ర చేయడానికి అనుమతి కోరారు. దానిలో 200 మందికి పైగా పాల్గొంటారని, ఒకవేళ ఆ సంఖ్య బాగా పెరిగితే ఒక్కో బృందంలో 200 మందికి మించకుండా వేర్వేరు బృందాలుగా వెళతామని చెప్పారు. మేం మీరు పంపిన విజ్ఞప్తిని ఆయా జిల్లాల పోలీసు అధికారులకు పంపి అభిప్రాయం కోరాం. మీ విజ్ఞప్తిని, వారి అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఈ కింది ఉత్తర్వులిస్తున్నాను. గతేడాది మీరు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా కోర్టు ఆదేశాలతో కొన్ని షరతులతో మీకు అనుమతిచ్చాం. పాదయాత్రలో మీరు ఆ షరతులన్నీ ఉల్లంఘించారు.

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసి గాయపరచటం, వారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అందుకు వివిధ జిల్లాల్లో మీపై 71 క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. రెండు కేసుల్లో మీకు శిక్ష కూడా పడింది. ఇప్పుడు మీరు పాదయాత్ర కోసం ప్రతిపాదించిన మార్గంలోని వివిధ ప్రాంతాల్లో మూడు రాజధానులపై వివిధ ఆకాంక్షలు ఉన్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం కూడా మీ పాదయాత్ర మార్గంలో ఉంది. 200 మందితో పాదయాత్ర చేస్తామని చెబుతూనే ఆ సంఖ్య పెరిగితే చిన్న చిన్న బృందాలుగా మార్చుకుని వెళతామంటున్నారు.. అంటే ఎంతమంది వస్తారన్నదానిపై మీకే నియంత్రణ ఉండదని అర్థమవుతోంది.

పాదయాత్రలో ఎవరు పాల్గొంటారో, ఎంత మంది పాల్గొంటారో తెలియనప్పుడు, వారిని గుర్తించడమే కాదు యాత్రను పర్యవేక్షించడం కూడా అధికారులకు కష్టమవుతుంది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా మీరు పాదయాత్ర చేసే క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. యాత్రలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఇంత మందికి భద్రత కల్పించడం చాలా కష్టం. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయంలో రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల శాంతిభద్రతల సమస్యగా మారి మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టడం వరకు వెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలోనూ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మీ పాదయాత్ర ఆ జిల్లా మీదుగానూ సాగనుంది. కాబట్టి పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశాల్ని, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నాం’ అని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.