ఆపత్కాల సమయంలో తెలంగాణలోని వసతి గృహాల్లో విద్యార్థులు, ఉద్యోగులను ఖాళీ చేయమనడంపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వసతి గృహాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించవద్దన్న డీజీపీ.. అలా చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా వసతి గృహాల నిర్వాహణ కొనసాగించాలని ఆదేశించారు.
వారితో సమన్వయం...
జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అనుమతి పత్రాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. తదుపరి అదేశాల వచ్చే వరకు ఎలాంటి అనుమతులు పనిచేయవని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు గుంపులుగా రావద్దని ఆదేశాలు జారీ చేశారు.