ETV Bharat / city

'కక్ష సాధింపు చర్యలే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తోంది' - దేవినేని తాజా వార్తలు

కక్ష సాధింపు చర్యలే ఎజెండాగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని... మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఎవరిపై ఏ కేసులు పెడదామన్న ఆలోచనే తప్ప...పరిపాలన ప్రజా సంక్షేమంపై పాలకులకు దృష్టి లేదని విమర్శించారు. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపిన దేవినేని... రాజధాని రైతుల పోరాటం అంతిమంగా నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కక్ష సాధింపు చర్యలే ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తోంది

author img

By

Published : Sep 27, 2020, 5:59 PM IST

ఎవరిపై ఏ కేసులు పెడదామన్న ఆలోచన తప్ప.. పరిపాలన, ప్రజా సంక్షేమంపై పాలకులకు దృష్టి లేదని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కక్ష సాధింపు చర్యలే ఎజెండాగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని.. ఎవరు ఏ నిధులు ఎందుకు వెచ్చిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు.

తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపిన దేవినేని... రాజధాని రైతుల పోరాటం అంతిమంగా నెగ్గుతుందని భరోసానిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు నైతిక స్థైర్యంతో పోరాడుతున్నారని వ్యాఖ్యనించారు.

ఇదీ చదవండి:

'అంతర్వేది రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులను విస్మరిస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.