ETV Bharat / city

మట్టి వినాయకులకు జై.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు నై - demond increasing for sand vinaykas, vijayawada

కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై చేసుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ పండుగకు మరింత వన్నె తీసుకువస్తుంటారు. అయితే వినాయక చవితి అంటే కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలే అన్నట్టు....ఏళ్ల తరబడి వాటినే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. వాటి వల్ల దుష్పరిణామాలు కలుగుతాయంటూ పర్యావరణ వేత్తలు చేస్తున్న హెచ్చరికలు చెవికెక్కాయో ఏమో....ఇప్పుడిప్పుడే వాటి మోజు నుంచి బయటపడుతున్నారు వినాయక మండప నిర్వాహకులు.

మట్టి వినాయకులకు జై..ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు నై
author img

By

Published : Aug 25, 2019, 7:03 AM IST

మట్టి వినాయకులకు జై..ప్లాస్టర్ ఆఫ్ పారిస్​కు నై

'మట్టి మన సంస్కృతి.. మట్టి విగ్రహాలను పూజిద్దాం...పర్యావరణాన్ని కాపాడుకుందాం' అనే నినాదం ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే బలంగా వెళుతోంది. ఓ వైపు కంటికి ఇంపుగా.. అందంగా, ఆకర్షణీయంగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెద్ద ఎత్తున పూజలు అందుకుంటున్నా....మరోవైపు మట్టి విగ్రహాల ప్రాముఖ్యత, వాటి ద్వారా పర్యావరణానికి కలుగుతున్న మేలుపై పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోంది. వివిధ రకాల సైజులు, ఆకారాలు, వైవిధ్యంగా తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

విజయవాడ నగరంలోని కాలనీలు, అపార్టుమెంట్లు, కూడళ్లలో ఏర్పాటు చేసే మండపాల్లోనూ మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు పెద్ద ఎత్తున నిర్వాహకులు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా తరకటూరుకు చెందిన సేవ్ లాంచి స్వచ్ఛంద సంస్థలు భారీ స్థాయిలో మట్టి విగ్రహాలను తయారుచేస్తున్నాయి. మట్టి విగ్రహాలను పూజిద్దాం....మన చెరువులను కాపాడుకుందాం అనే నినాదంతో నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాయి. చేతి వృత్తులను ప్రోత్సహించి....వారికి పని కల్పించడమే కాక.. స్వదేశీ వస్తువులనే వాడాలనే భావనను పెంపొందిస్తున్నాయి.

గతంతో పోలిస్తే...ఇప్పుడు మట్టి విగ్రహాలను పూజించడం పట్ల ప్రజలూ అవగాహన పెంచుకుంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్న విషయాన్ని గమనించామని చెబుతున్నారు. భావి తరాలకు కూడా మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను చెప్పే ఉద్దేశంతో...వీటిని పూజించేందుకు ముందుకువచ్చామని పలువురు అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా.... కాలువలు, చెరువులు, నదులను కలుషితం చేస్తూ......జీవరాశుల మనుగడ ప్రశ్నార్ధమవడానికి కారణమవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మట్టి గణపతులవైపు ప్రజలు మొగ్గు చూపడం హర్షించదగ్గ విషయమే.

Intro:యాంకర్
గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం తాసిల్దారు మృత్యుంజయరావు అన్నారు పి గన్నవరం ఎంపీపీ కార్యాలయంలో లో 450 మంది గ్రామ వాలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు ప్రభుత్వ పథకాల పట్ల గ్రామ వాలంటీర్లు అవగాహన పెంచుకోవాలని అని తెలిపారు
భగత్ సింగ్ రిపోర్టర్8008574229

Body:గ్రామ వాలంటీర్లకు శిక్షణ

Conclusion:శిక్షణా తరగతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.