కేంద్ర ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకోవాలని దిల్లీలో ధర్నా చేపట్టడానికి వెళ్లిన పోలవరం నిర్వాసితులను అక్కడి పోలీసుల అడ్డుకున్నారు. ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడానికి మంగళవారం సాయంత్రం దిల్లీ చేరుకున్న నిర్వాసితులను ఇక్కడ ఉండటానికి వీళ్లేదంటూ పోలీసులు అండ్డుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడి కరోల్భాగ్లోని ఓ హోటల్‌కు చేరుకున్న పోలవరం బాధితుల వద్దకు దిల్లీ పోలీసుల వచ్చి ఆధార్ కార్డులు పరిశీలించి.. దిల్లీ ధర్నాకు అనుమతులు లేవని చెప్పి వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు పోలవరం బాధితులు తెలిపారు.
ఇదీ చదవండి..
SOMU: 'చట్టాలకు విరుద్ధంగా ఏపీ రూ.25 వేల కోట్ల అప్పులు'..కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు