ETV Bharat / city

అద్దె భవనాల్లో కొనసాగినా ప్రవేశాలకు ఓకే - ap degree college admissions news

అద్దె భవనాల్లో కొనసాగిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు ఇచ్చారు.

degree college online admissions
degree college online admissions
author img

By

Published : Sep 8, 2021, 9:54 AM IST

పదేళ్లకుపైగా అద్దె, లీజు భవనాలలో కొనసాగుతున్న డిగ్రీ కళాశాలలు ఈఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. ఏడాదిలోపు శాశ్వత భవనంలోకి మారతామనే షరతుతో యాజమాన్యాల నుంచి లేఖ తీసుకోవాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలకు ప్రవేశాలు నిలిపేస్తామని గత కొన్నేళ్లుగా ప్రకటనలు చేయడం, తర్వాత ఏదో ఒక షరతు పెట్టి అనుమతులివ్వడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో 754 కళాశాలలు అద్దె భవనాల్లో ఉండగా.. వీటిల్లో 543 కళాశాలలు 10ఏళ్లకుపైబడి ఈ భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

శిథిల భవనాలు, ప్రహరీల కూల్చివేతకు ఆదేశాలు

పురపాలక పాఠశాలల ఆవరణలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రహరీలను కూల్చివేయాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. కూల్చివేసిన వాటి స్థానంలో నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని, మైనర్‌ మరమ్మతులను చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల నిధులను ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. కూలేందుకు సిద్ధంగా ఉండే వృక్షాలు, వాటి కొమ్మలను కొట్టేయాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:AP NIT: దక్షిణాదిలో ఉత్తమ విద్యాసంస్థగా ఏపీ నిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.