ETV Bharat / city

Yadadri temple news: యాదాద్రిలో కొవిడ్ ఆంక్షలు..తగ్గిన భక్తుల రద్దీ... - yadadri reconstruction

Yadadri temple news: ఆదివారం వచ్చిందంటే చాలు.. భక్తులతో కిటకిటలాడే తెలంగాణ తిరుపతి యాదాద్రీశుని సన్నిధిలో ఈవారం అంతగా సందడి లేదు. కరోనా కారణంగా యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. అరగంటలోపే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు.

Yadadri temple news
యాదాద్రిలో కరోనా ఎఫెక్ట్​.. తగ్గిన భక్తుల రద్దీ
author img

By

Published : Jan 23, 2022, 3:44 PM IST

Yadadri temple news: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి నిత్యారాధనలు, కల్యాణపర్వం కన్నులపండువగా జరిగింది. సుప్రభాతంతో మొదలైన ఆలయ కైంకర్యాలు.. వేకువజామున మేల్కొలుపు నిర్వహించాక ప్రతిష్ఠామూర్తులకు ఆలయ అర్చకులు హారతి నివేదన జరిపారు.

పాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. స్వర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలతో అష్టోత్తరం, సుదర్శన హోమం చేపట్టారు. శ్రీ స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం భక్తులకు కనువిందు కలిగించింది.

కరోనా నిబంధనల దృష్ట్యా ఈవారం ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. నిత్యం సందడిగా ఉండే ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అరగంటలోపే స్వామి వారిని దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అధికారులు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.

Yadadri temple news
యాదాద్రిలో కరోనా ఎఫెక్ట్​.. తగ్గిన భక్తుల రద్దీ

యాదాద్రిలో మార్చి 21 నుంచి నిర్వహించనున్న మహా యాగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మార్చి 28న శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఆ రోజు నుంచి గర్భాలయంలోని స్వయంభువులను భక్తులు దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.

Decreased crowd of devotees on the hill due to Kovid
కొవిడ్​ కారణంగా కొండపైన తగ్గిన భక్తుల రద్దీ

వారం రోజుల పాటు నిర్వహించనున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం నిర్వహణకు రెండు నెలలే మిగిలి ఉండగా ఏర్పాట్లలో వేగం పెంచుతున్నారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించిన ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి.. ప్రధానాలయ పనులను పరిశీలించారు.

Eternal worship to Swami
స్వామి వారికి నిత్యారాధనలు

ఇదీ చదవండి: Red Sandalwood : ఎర్రచందనం...ఇది ఎందుకింత స్పెషల్..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.