కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలన్నీ తెలంగాణలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుపై సందిగ్ధత నెలకొంది. కరోనా జాగ్రత్తలు తీసుకోకపోతే థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం.. నేడు విధివిధానాలను ఖరారు చేయనుంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష తరగతులను నిర్వహించటాన్ని స్వాగతిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తరువాత ఏపీ ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి: