Cyber Crime: తెలంగాణలోని మరో నకిలీ కాల్ సెంటర్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి... విదేశాల్లో ఉన్నవారికి క్రెడిట్ కార్డులను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో మొహాలీ, హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ముఠా నకిలీ కాల్ సెంటర్ ముసుగులో.. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. విదేశాల్లోని వారికి క్రెడిట్ కార్డులు సరఫరా చేస్తున్నారు. ముఠాలో కీలక సూత్రధారిగా నవీన్ బొటానీ వ్యవహిస్తున్నాడు. ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను అమ్మి.. ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు.
విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేస్తుంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. దర్యాప్తు చేపట్టాం. 80 మందితో నకిలీ కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. మరో రెండు ముఠాలు దుబాయ్ నుంచి.. పని చేస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతో.. నకిలీ కాల్ సెంటర్‌పై దాడి చేసి.. ఏడుగురుని అరెస్ట్ చేశాము.
-సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
ముఠా సభ్యులు 7 గురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.కోటి 11 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు.. సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ముఠా బాధితులు వేలలోనే ఉంటారన్న సీపీ.... మరింత లోతుగా విచారిస్తున్నారమని తెలిపారు. ప్రజలు ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ఇదీ చూడండి: Jobs Fraud in APSRTC: ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో మోసాలపై పోలీసులకు ఫిర్యాదు