రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని... పరిస్థితి అదుపులోనే ఉందని లేఖలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని అన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎస్.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 28కి చేరిన కరోనా అనుమానితులు