Growing investments: పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా.. సాగుపై రైతులకు ఇచ్చే రుణ పరపతి కూడా పెరగాలి. అయితే రైతులు అధిక పెట్టుబడులు పెట్టే మిరప, పసుపు, పొగాకుతో పాటు కొన్ని పండ్లతోటలు, కూరగాయ పంటలకు గతేడాది ఎంత పంట రుణపరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఉందో.. ఈ ఏడాదీ దాన్నే కొనసాగిస్తున్నారు. ఎరువుల ధరలు 40% వరకు పెరిగాయి. డీజిల్ ధర పెరుగుదలతో యంత్రసేద్య వ్యయం అధికమైంది. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఎకరా మిరప, పసుపు సాగుకు రైతులు రూ.1.50 లక్షల వరకు పెడుతున్నారు. కౌలు రైతులకు మరో రూ.30వేలు అదనంగా ఖర్చవుతుంది. అయితే ఎకరాకు ప్రభుత్వం ఇచ్చేది గరిష్ఠంగా రూ.88వేలే. కౌలుతో కలిపితే అదనంగా రూ.90వేల వరకు రైతులు సొంతంగానే సమకూర్చుకోవాలి. బ్యాంకుల నుంచి అందే గరిష్ఠ రుణం రూ.3,916 కోట్లే. అంటే రూ.2,759 కోట్లను రైతులు బయట నుంచి వడ్డీకి తెచ్చుకోవాల్సిందే. దీంతో ధర తక్కువ వచ్చినా ఎంతో కొంతకు అమ్మి అప్పు తీర్చాల్సి వస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.
* వర్జీనియా పొగాకు సాగుకు బ్యారన్‌కు రూ.6 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. దీనికి ఎకరాకు రూ.70-72వేలుగా నిర్ణయించారు. గతేడాది కంటే పెంచలేదు. ఒక్కో బ్యారన్‌కు సగటున అయిదెకరాల వరకు సాగుచేస్తారు. అంటే రూ.3.50 లక్షల రుణమే అందుతుంది.
* సాగుకు హామీ లేకుండా ఇచ్చే రుణపరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ భారతీయ రిజర్వ్‌బ్యాంక్ 2019లో నిర్ణయం తీసుకుంది. అయినా బ్యాంకులు పట్టాదారు పాసుపుస్తకాలపైనే పంట రుణాలు మంజూరు చేస్తున్నాయి. బ్యాంకులు సాగుకు గరిష్ఠంగా ఇచ్చేది రూ.లక్ష లోపు మాత్రమే. ఎక్కువ పంటలకు ఎకరాకు రూ.30వేలు, రూ.40వేల మధ్యనే ఉంటోంది.
ఇవీ చదవండి: