కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐస్‌క్రీం సంస్థ క్రీమ్‌స్టోన్ సైతం.. కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తోన్న హైదరాబాద్ పోలీసులకు ఐస్క్రీంలను పంపిణీ చేసింది.
ఇదీ చూడండి: 'ఆర్మీ' పేపర్ లీక్: సికింద్రాబాద్ కల్నలే సూత్రధారి!
అసలే ఎండాకాలం ఆపై లాక్డౌన్.. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు కాస్త చల్లదనం అందించాలనే ఉద్దేశంతో ఐస్క్రీంను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ నిర్వహకులు ఫ్రాంక్లిన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 జోన్లలో 83 చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5వేల మంది పోలీసులకు ఐస్‌క్రీమ్ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: