ETV Bharat / city

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు - అమరావతి రైతుల ఆందోళనలు న్యూస్

సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు సార్లు సభలో ప్రవేశ పెట్టి ఆమోదించుకోలేకపోయిన ప్రభుత్వం... ఇప్పుడు బంతిని గవర్నర్​ కోర్టులోకి నెట్టేసింది. రాజ్యాంగ నియమావళి ప్రకారం.. ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు గవర్నర్​ ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

crda and three capitals bill sent to ap governor for approval

author img

By

Published : Jul 18, 2020, 5:44 PM IST

Updated : Jul 19, 2020, 6:14 AM IST

సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. శాసనమండలిలో రెండోసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టి నెల రోజులైంది. ఈ నిబంధన మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు బిల్లులను పంపించారు.

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

రాజ్యాంగంలోని 197వ అధికరణ క్లాజ్‌ 2 ప్రకారం బిల్లును ప్రభుత్వం రెండోసారి సభలో ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత మండలి సాధారణ అనుమతిగా పరిగణిస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.

అసలు ఏం జరిగిందంటే...

సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ ముందు ఉంచింది. ఆధిక్యం ఉన్న శాసనసభలో సులభంగానే బిల్లులు ఆమోదం పొందాయి. కానీ మండలికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వ వ్యూహం బెడిసి కొట్టింది. ఈ బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షం ససేమిరా అంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రూల్‌ 71 తీర్మానంతో పై చేయి సాధించింది. ఈ తీర్మానం నెగ్గడంతో ఈ రెండు బిల్లలపై సభలో ప్రస్తావన రాకుండానే సమావేశాలు ముగిశాయి.

ఈ చర్యతో అగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆ దస్త్రం కేంద్రం వద్దే పెండింగ్ లో ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోలేదు. ఈ బిల్లుల విషయమై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇంతలో బడ్జెట్​ సమావేశాలు రానే వచ్చాయి. మూడు రోజులే జరిగిన ఈ సమావేశాల్లో చాలా బిల్లలను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. వీటితోపాటే మరోసారి సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా ప్రభుత్వం మండలి ముందుకు తీసుకొచ్చింది. ఆఖరి రోజున ద్రవ్యవినిమయ బిల్లు సహా ఈ రెండు బిల్లులను మండలి ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. ముందుగా ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కీలకమైన ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదించుకోవాలని... అనంతరం ఈ రెండు బిల్లుల అంశాలన్ని ఆలోచించాలని సూచించాయి.

ఈ క్రమంలోనే అధికార ప్రతిక్షాల మధ్య యుద్ధ వాతారణం నెలకొంది. తీవ్ర స్థాయిలో ఆరోపణప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో ముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లు సహా సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదు.

అనంతరం ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. దీంతో గవర్నర్​ వద్దకు ఈ బిల్లులను పంపించి ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రెండు బిల్లులను గవర్నర్​ వద్దకు పంపించింది.

ఇదీ చదవండి:

గవర్నర్ ఆమోదానికి సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లులు

Last Updated : Jul 19, 2020, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.