కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సమావేశం ఫలప్రదమైందని విజయసాయి రెడ్డి చెబుతున్నారని... ఏమి జరిగిందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తీసుకువస్తామన్నారని... 22 మందిని ఇస్తే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జోవో జారీ చేయటం తగదని అన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటికెళ్లి ఆమె భర్తపై కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీసీపై అట్రాసిటీ కేసు పెట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. కక్షపూరిత చర్యలు ఆపకుంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి : 'కేంద్రం ఇచ్చిన నరేగా నిధులను రాష్ట్రం పక్కనపెట్టింది'