రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు ఆయన లేఖ రాశారు.
అమరావతి అంశంతో పాటు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై.. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్నారు. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించటం తగదని ఆయన హితవు పలికారు.
ఇదీ చదవండి