మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో అధికార పార్టీ ఏమైనా చేయొచ్చనే విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కొవిడ్ నిబంధనలు వైకాపా నేతలకు వర్తించవా అని ప్రశ్నించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం పట్ల నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి విఫలమవ్వడం వల్లే ఈ ఘటన దిల్లీ వరకు వెళ్లిందన్నారు. వైకాపా నాయకులు దాడులకు పాల్పడితే పోలీసులపై చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, డీజీపీ నైతిక బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చదవండీ... 'ఆ బిల్లులు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేకం'