కరోనా వ్యాప్తి కట్టడికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని వాడుకుంటోంది. తాజాగా 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' అనే యాప్‌ను ప్రవేశపెట్టింది
యాప్ పనిచేసే విధానం
* గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* మొబైల్ నంబరుతో రిజిస్టర్ అవ్వాలి.
* తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
* జ్వరం, దగ్గు, శ్వాసపరమైన ఇబ్బందులు వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలి.
ఈ సమాచారం మేరకు స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. కరోనాపై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాలని వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి.. సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?