రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్జీయూకేటీ సెట్)లో సాధించిన మార్కులు, వెనుకబాటు సూచి కింద 0.4పాయింట్లు కలపడంతో వచ్చిన ర్యాంకులు, కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ హరినారాయణ ప్రకటనలో తెలిపారు. నూజివీడు, ఇడుపులపాయ ప్రాంగణాల్లో జనవరి 4 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని, ర్యాంకుల ఆధారంగా పిలుస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్ తేదీల సమాచారాన్ని అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 8గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఒరిజనల్ ధ్రువపత్రాలు, రెండు జతల జిరాక్స్‌లు తీసుకురావాలని సూచించారు.
జనవరి 4 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ - RGKUT news
ఆర్జీయూకేటీ సెట్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా జనవరి 4 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉంటుందని కన్వీనర్ హరినారాయణ తెలిపారు.