ETV Bharat / city

ఆర్టీఈకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో.. రాష్ట్రంలో అమలుకు అవకాశం! - విద్యాశాఖ వార్తలు

ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల భర్తీపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలుకు మార్గం సులువు అయ్యింది. ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రముఖ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.

Corporate education for the poor
రాష్ట్రంలో అమలుకు అవకాశం
author img

By

Published : Aug 18, 2021, 7:49 AM IST

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల భర్తీపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఇప్పుడు ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకుంటే పేదవారికి కార్పొరేట్‌ విద్య సులభంగా అందుతుంది. రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రముఖ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ప్రైవేటు విద్యా సంస్థలు తమ పరిధిలోని కాలనీలు, గ్రామాలకు చెందిన విద్యార్థులకు 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ చేరుతుంది.

చట్టం ప్రకారం ఇలా..

ఆర్టీఈ చట్టం ప్రకారం 14ఏళ్ల వరకు పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను సెక్షన్‌ 12(1)(సీ) కింద పేదవారికి కేటాయించాలి. ఆయా పాఠశాలల్లో ప్రారంభ తరగతుల్లో ఎల్‌కేజీ లేదా ఒకటో తరగతిలోని సీట్లలో 25శాతం పాఠశాల పరిధిలోని పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వమే ఆ విద్యార్థుల రుసుములను ప్రైవేటు బడులకు చెల్లిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద నిధులను పొందే అవకాశం ఉంటుంది. చెల్లింపుల కోసం ప్రైవేటు బడులకు ప్రభుత్వమే ఫీజులను నిర్ణయించవచ్చు.

సీటు పొందిన విద్యార్ధుల నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం డొనేషన్లను వసూలు చేయడానికి విలులేదు. ప్రవేశాలకు రాత, మౌఖిక పరీక్షలను నిర్వహించకూడదు. కేవలం ఆర్థిక, సామాజిక, వెనుకబాటుతనం ఆధారంగానే ప్రవేశాలను కల్పించాలి.

పిల్లల్ని అందరు విద్యార్థులతో సమానంగా చూడాలి. ఏ కారణంతోనూ పాఠశాల నుంచి బయటకు పంపకూడదు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్నారు.

ఫీజులే కీలకం..

పాఠశాలలకు బోధన రుసుములను నిర్ణయించేందుకు ఇప్పటికే పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్‌ నిర్ణయించే ఫీజునే 25శాతం కోటా విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కమిషన్‌ గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల వారీగా ఫీజులను ప్రతిపాదించింది. వీటికి ప్రభుత్వం ఆమోదం లభించాల్సి ఉంది. ఇవే ఫీజులను ఇతర విద్యార్థుల నుంచి యాజమాన్యాలు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

Speed Cameras in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్‌ కెమెరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.