హైదరాబాద్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొని వచ్చిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కరోనా బారినపడ్డారు. బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ మే 5న విధుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఈ నెల 7న వచ్చారు. అనుమానిత లక్షణాలు ఉండగా మూడు రోజుల క్రితం పరీక్ష చేశారు. శనివారం వచ్చిన ఫలితాల్లో వైరస్ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో తోటి కానిస్టేబుల్ నుంచి అతనికి సోకినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: సీఎం జగన్నాటకం ముందు ఆస్కార్ అవార్డు దిగదుడుపే: నారా లోకేశ్