Shamshabad Airport CEO: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పనిక్కర్ వెల్లడించారు. అరైవల్ గేట్ల వద్ద థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల కోసం టర్మినల్ వద్ద ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ప్రయాణికులకు ముందుగానే టెస్ట్ చేయించుకునే అవకాశం కలిగిందన్నారు. ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులకు ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశామన్నారు.
పాజిటివ్‌గా తేలితే టిమ్స్కే..
ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.750 చెల్లించి.. ఫలితం కోసం 6 గంటలు వేచి చూడాల్సి ఉంటుందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పనిక్కర్ చెప్పారు. ర్యాపిడ్ టెస్టు కోసం రూ.3,900 ఖర్చుచేసి రెండు గంటలు వేచి ఉండాలన్నారు. 5 ఏళ్ల చిన్నారులకు మినహాయింపు ఉంటుందన్నారు. చిన్నారులకు లక్షణాలు ఉంటే టెస్టు తప్పనిసరి అని స్పష్టం చేశారు. హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితాలు వచ్చిన తర్వాతే ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. ఎయిర్‌పోర్టులో పాజిటివ్ అని తేలితే నేరుగా టిమ్స్ ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
ఇప్పటివరకు 13 మందికి పాజిటివ్
హైరిస్క్ దేశాల నుంచి హైదరాబాద్‌కు వారానికి 12 విమానాలు వస్తున్నాయని ఎయిర్‌పోర్టు సీఈవో తెలిపారు. ప్రధానంగా లండన్ నుంచి 5 విమానాలు, సింగపూర్ నుంచి వారానికి మూడు విమానాలు వస్తున్నాయన్నారు. ఈ నెల 7న హై రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్‌కు 1,908 మంది ప్రయాణికులు రాగా.. అందులో 13 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చదవండి: