రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ఉద్యోగులు, అధికారులకు వేర్వేరు సమయాలను కేటాయించారు. హోదాల వారీగా ఉద్యోగులందరికీ వేర్వేరు సమయాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. సచివాలయంలోని రెండో బ్లాక్ కాన్ఫరెన్సు హాలులో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి రానున్న 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు