కొత్తగా నమోదైన 491 కేసులతో.. రాష్ట్రంలో మెుత్తం కేసుల సంఖ్య 8452కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో రాష్ట్రానికి చెందివారు 6620 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1506 మంది. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 326 మంది కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,111గా ఉంది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,240 మంది చికిత్స పొందుతున్నారు.
గ్రాఫ్ ఇలా ఉంది..
- మార్చి 24 వరకు రాష్ట్రంలో 8 కరోనా కేసులు నమోదు
- తొలి విడత లాక్‌డౌన్ 21 రోజుల్లో 495 కరోనా కేసులు
- రెండో విడత లాక్‌డౌన్ 19 రోజుల్లో 1,147 కరోనా కేసులు
- మూడో విడత లాక్‌డౌన్ 14 రోజుల్లో 782 కరోనా కేసులు
- నాలుగో విడత లాక్‌డౌన్ 14 రోజుల్లో 1,244 కరోనా కేసులు
- లాక్‌డౌన్ ఎత్తివేసిన ఈ 20 రోజుల్లో 4,776 కరోనా కేసులు
ఇదీ చదవండి: పదో తరగతి పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్