కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తమ హాస్టల్‌ను 48 గంటల్లో మూసివేస్తున్నట్లు పంజాబ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది. రేపటిలోగా వసతి గృహాలు ఖాళీ చేయాలని వర్సిటీ యాజమాన్యం ఆదేశించింది.
వర్సిటీ విద్యార్థులను ఆయా రాష్ట్రాలు తమ స్వస్థలాలకు తరలించాయి. ఒడిశా, కేరళ ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక కోచ్‌లు ఏర్పాటు చేశాయి.
పంజాబ్ సెంట్రల్ వర్సిటీలో సుమారు 60 మంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సొంత ఊళ్లకు వచ్చేందుకు రిజర్వేషన్లు దొరక్క వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరకు.. రైలు, విమాన టికెట్లు కొనుగోలు చేసి స్వస్థలాలకు వస్తున్నారు.
- ఇదీ చూడండి :భయం భయం.. క్రీడారంగంపై కరోనా ప్రభావం