ETV Bharat / city

వీధి వ్యాపారాలపై కొవిడ్ పంజా... గిరాకీ లేక వ్యాపారుల విలవిల

కరోనా ప్రభావంతో వీధి వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. కొవిడ్‌ ప్రభావం గిరాకీ లేక కష్టాలపాలవుతున్నారు. ఈ నష్టాలతో పూట గడవడమే కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులకు వడ్డీలు పెరిగి బతుకు భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

corona effect
వీధి వ్యాపారులపై కరోనా ప్రభావం
author img

By

Published : May 5, 2021, 8:41 AM IST

వీధి వ్యాపారులపై కరోనా ప్రభావం

కొవిడ్‌కు ముందు ఫాస్ట్ పుడ్ సెంటర్లు, బజ్జీల బండ్లు, పూలకొట్లు, ఛాయ్ దుకాణాలు కళకళలాడుతుండేవి. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే కొవిడ్‌ మొదటి వేవ్‌ తర్వాత పరిస్థితి కొంతమేర కుదుటపడుతుందనుకున్న తరుణంలో రెండోవేవ్‌ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎక్కడ వైరస్‌ సోకుతుందనే భయంతో అత్యవసరమైతే అయితే తప్ప ప్రజలు పెద్దగా వస్తువులు కొనుగోలు చేయటం లేదు. దీంతో గిరాకీ లేక వీధి వ్యాపారులు అల్లాడుతున్నారు. కరోనా దెబ్బతో వ్యాపారాలు 70 శాతం పడిపోయాయని వాపోతున్నారు.

కర్ఫ్యూతో తీవ్ర నష్టం

కరోనా కారణంగా ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే... రాత్రి పూట కర్ఫ్యూతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని వీధి వ్యాపారులు వాపోతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత గిరాకీ ఎక్కువగా ఉండేదని... ప్రస్తుతం ఆ సమయానికే దుకాణాలు మూసివేస్తుడటం వల్ల రోజువారీ ఖర్చులు మిగలట్లేదని తెలిపారు. అమ్మేందుకు తెచ్చిన సరుకు వీధిపాలవుతోందని... ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

500 కూడా రావట్లేదు

కొవిడ్‌ వల్ల ఒక్కప్పటిలా గిరాకీలు ఉండటం లేదని... అప్పుడు రోజుకి వెయ్యి రూపాయుల సంపాదిస్తే... ప్రస్తుతం 500 కూడా రావట్లేదని వ్యాపారులు తెలిపారు. తమకు రోజు వచ్చే ఆదాయంతోనే ఇళ్లు గడుస్తుందని... ఆదాయం సగానికి పైగా పడిపోవడంతో పూట గడవటం కష్టతరమైందని ఆందోళన చెందుతున్నారు.

మహమ్మారి ధాటికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుండటంతో ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని వీధి వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.