రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 161కి చేరాయి. ఇవాళ కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. నెల్లూరులో ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం కొవిడ్ 19 కేసులు 32కి చేరాయి. కడపలో ఇవాళ కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కడప జిల్లాలో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఇవాళ కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులతో..మొత్తం కేసుల సంఖ్య 14కి చేరింది.
తొలి మరణం
రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా మరణాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో సోమవారం మృతి చెందినట్లు ప్రకటించింది. మార్చి 30న ఉదయం 11.30 గం.కు వ్యక్తి చెకప్‌కు వచ్చారన్న ప్రభుత్వం.. గంట వ్యవధిలో మ. 12.30 గం.కు చనిపోయారని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి కుమారుడు మార్చి 17న దిల్లీ నుంచి వచ్చారన్న ప్రభుత్వం... మార్చి 31వ తేదీన కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యిందని ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకిందని ప్రభుత్వం భావిస్తుంది. వీరితో కాంటాక్ట్ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లాల్లో కొత్త కేసులు :
- నెల్లూరు 8
- కడప 1
- విశాఖ 3