ETV Bharat / city

AP Corona cases today: రాష్ట్రంలో కొత్తగా 1,557 కరోనా కేసులు, 18 మరణాలు

corona cases in ap
corona cases in ap
author img

By

Published : Aug 29, 2021, 4:51 PM IST

Updated : Aug 29, 2021, 5:31 PM IST

16:47 August 29

కోలుకున్న 1,499 మంది బాధితులు

corona cases bulletin
కరోనా హెల్త్ బులిటెన్

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,557 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి బారినపడి మరో 18 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,825కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల 12వేల 123 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,213 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19లక్షల 83వేల 119కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్‌ కేసులున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 65 లక్షల 35 వేల 822 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా.. చిత్తూరు జిల్లాలో 255, తూ.గో.జిల్లాలో 232, ప.గో. జిల్లాలో 212, నెల్లూరు జిల్లాలో 164 కరోనా కేసులు నమోదైనట్లు తాజా హెల్త్ బులిటెన్​లో పేర్కొంది.

జాతీయ స్థాయిలో...

భారత్​లో కొవిడ్​ కేసులు (Corona virus India) వరుసగా నాలుగో రోజూ 40 వేలకుపైగా నమోదయ్యాయి. కొత్తగా 45,083 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 35,840 మంది కరోనా​ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. శనివారం ఒక్కరోజే 17 లక్షల 55 వేలకుపైగా పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 51 కోట్ల 86 లక్షలు దాటింది. కరోనా వ్యాక్సినేషన్​లో (COVID vaccination) భారత్ దూసుకెళ్తోంది. శనివారం 73 లక్షలకుపైగా టీకా డోసుల్ని లబ్ధిదారులకు అందించారు అధికారులు. మొత్తంగా ఇప్పటివరకు 63 కోట్ల 9 లక్షల 17 వేల 927 టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం.

కేరళలో లాక్​డౌన్​..

కేరళలో కరోనా విజృంభిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన 45,083 కేసుల్లో 31,265 కేరళ నుంచే కావడం గమనార్హం. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లాక్​డౌన్​ కారణంగా తిరువనంతపురం సహా పలు ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

  • సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.
  • లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్యలో క్రియాశీల కేసులున్నట్లు వెల్లడించింది.
  • జులైలో రెండు పండగల కోసం ఆంక్షలను సడలించిన నాటి నుంచి కేరళలో మరోసారి వైరస్​ విజృంభిస్తోంది.

ప్రపంచ దేశాల్లో కేసులు ఇలా..

కరోనా పలు దేశాలపై మళ్లీ విరుచుకుపడుతోంది.

  • ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 5 లక్షల 43 వేల కేసులు, 8 వేలకుపైగా మరణాలు సంభవించాయి.
  • అమెరికాలో శనివారం 72 వేల కేసులు నమోదయ్యాయి. మరో 600 మందికిపైగా చనిపోయారు.
  • బ్రెజిల్​, రష్యా, మెక్సికో, ఇరాన్​లోనూ కేసులు తీవ్ర స్థాయిలో వెలుగుచూస్తున్నాయి.

ఇదీ చదవండి:

Covaxin India: అంక్లేశ్వర్​ నుంచి కొవాగ్జిన్​ ఫస్ట్​ బ్యాచ్​ విడుదల

Corona Virus: ఏడాది దాటినా వీడని కరోనా సమస్యలు

Last Updated : Aug 29, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.