కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే అధికం
రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వేలకు చేరువవుతున్నాయి. శనివారం కొత్తగా 43 మంది వ్యాధి బారినపడటంతో మొత్తం కేసుల సంఖ్య 1930కి చేరింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు వంద కేసులకు చేరువలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 62కి చేరింది. శనివారం కృష్ణా జిల్లాలో అత్యధికంగా 16 మంది వ్యాధి బారిన పడ్డారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 11 మందికి సోకింది. ఏడు జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 45 మంది సంపూర్ణంగా కోలుకొని ఇళ్లకు చేరుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 887కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించారు.
అనంతలో వంద దాటాయి..
అనంతపురం జిల్లాలో శనివారం నమోదైన మూడు పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరుకుంది. వీరిలో హిందూపురానికి చెందినవారు 66 మంది ఉండగా, అనంతపురంలో నమోదైన కేసులు 22 ఉన్నాయి. మిగతా 14 కేసులు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ఇదీ చదవండి : క్వారంటైన్ కు వెళ్తేనే ఆంధ్రాలోకి అనుమతి!