రాజధాని తరలింపు నిర్ణయం ఓ చారిత్రక తప్పిదమని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. పిచ్చి తుగ్లక్ చర్య అని విమర్శించారు. రాజధాని తరలింపుపై వైకాపా చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రత్యేక హోదా సాధించి పోలవరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప రాజధాని మార్పు కానేకాదని స్పష్టం చేశారు. బంగారు బాతు లాంటి రాజధానిని మూర్ఖులు తప్ప ఎవ్వరూ వదులుకోరని తులసిరెడ్డి విమర్శించారు.
జాతీయస్థాయి ఉద్యమానికి శ్రీకారం : మస్తాన్ వలి
ప్రతిపక్ష నేతగా అమరావతిని స్వాగతించిన జగన్ ఇవాళ ఎందుకు మార్చుతున్నారో సమాధానం చెప్పలేని పరిస్థితి అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మస్తాన్ వలి విమర్శించారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అవహేళన చేయటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిపై ఆలోచన చేయకుంటే జాతీయ స్థాయి ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం చుడుతుందని మస్తాన్ వలి తెలిపారు.
ఇదీ చదవండి : పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!