ETV Bharat / city

మంత్రి సబిత ఇంటి వద్ద తల్లిదండ్రుల ఆందోళన.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ - సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు

Basara incident: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటివరకూ ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy
author img

By

Published : Jul 31, 2022, 8:34 PM IST

Sabitha Indra Reddy: హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముందు బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటివరకూ ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. ఫలితంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు.

అసలేం జరిగిదంటే: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర(basara RGUKT) ఆర్జీయూకేటీలో శనివారం రాత్రి నుంచి విద్యార్థులు భోజనం చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూడా విద్యార్థులు నిరాకరించారు. ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొనే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.

మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు భాజపా ఎంపీ సోయం బాపూరావు వస్తుండగా.. లోకేశ్వరం మండలంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా ఆర్జీయూకేటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.