ETV Bharat / city

జేపీ పవర్‌తో 'ఇసుక' ఒప్పందం పూర్తి - AP Sand Policy news

ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌తో గనులశాఖ ఒప్పందం పూర్తయింది. గురువారం ఆ సంస్థ బాధ్యతలు తీసుకొని, జిల్లాల వారీగా డిపోల ఏర్పాటు తదితరాలు పూర్తయ్యాక ఆఫ్‌లైన్‌లో విక్రయాలు ఆరంభించనుంది.

జేపీ పవర్‌తో 'ఇసుక' ఒప్పందం పూర్తి
జేపీ పవర్‌తో 'ఇసుక' ఒప్పందం పూర్తి
author img

By

Published : May 5, 2021, 7:55 AM IST

రాష్ట్రంలోని మూడు జోన్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌తో గనులశాఖ ఒప్పందం పూర్తయింది. సోమవారం ఒప్పంద ప్రక్రియ జరిగినట్లు గనులశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు మొదలవుతాయి. గురువారం ఆ సంస్థ బాధ్యతలు తీసుకొని, జిల్లాల వారీగా డిపోల ఏర్పాటు తదితరాలు పూర్తయ్యాక ఆఫ్‌లైన్‌లో విక్రయాలు ఆరంభించనుంది.

ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో ఉన్న అన్ని రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు, నిల్వ కేంద్రాల్లోని ఉన్న సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిలు తదితరాలను జిల్లా ఇసుక అధికారులు, టెండరు దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా పరిశీలిస్తారు. ఎన్ని ఉన్నాయనేది ఖరారు చేసి వాటిని ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. డిపోలు, స్టాక్‌ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలు కూడా కొలతలు వేసి అప్పగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌ ఉండకూడదు..

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన ఇసుక అంతటినీ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో వినియోగదారుల ఇళ్లకు సరఫరా చేయాలని ఏపీఎండీసీ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించేలోగా ఆన్‌లైన్‌ బుకింగ్‌లో పెండింగ్‌ ఉండకూడదని పేర్కొంది. వర్షాకాలపు అవసరాల కోసం తవ్వకాలు కూడా కొనసాగించాలని ఆదేశించింది.

ఇదీ చదవండీ... రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.