ETV Bharat / city

NMCRR: 'పోలవరం నిర్వాసితుల సమస్యలను.. సానుభూతితో పరిష్కరించండి'

author img

By

Published : Aug 19, 2021, 9:54 AM IST

పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేవరకు పర్యవేక్షిస్తామని ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌ ఛైర్మన్‌ అజయ్‌ టిర్కీ వెల్లడించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో సానుభూతితో వ్యవహరించాలని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జల్‌శక్తి అధికారులకు  ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌ కమిటీ సూచించింది.

Polavaram
Polavaram

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో సానుభూతితో వ్యవహరించాలని పరిహార, పునరావాస జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌) ఛైర్‌పర్సన్‌ అజయ్‌ టిర్కీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జల్‌శక్తి అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణంగా పరిహారం అందేవరకు తాము పర్యవేక్షిస్తామని కమిటీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ, పరిహారం, పునరావాసం చెల్లింపులకు సంబంధించిన అంశాలపై ఎన్‌ఎంసీఆర్‌ఆర్‌ బుధవారం సమీక్ష నిర్వహించింది.

ఈ సమీక్షకు హాజరైన పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ‘నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా బలవంతంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుర్తింపు కార్డులిచ్చి..ఇళ్లు, భూములు కోల్పోయిన వివరాలను పొందుపర్చాలి. ఉద్యోగాలు ఇస్తామన్నా.. దాని ఊసే లేకుండా పోయింది’ అని వివరించారు. న్యాయవాది శ్రవణ్‌ మాట్లాడుతూ.. విలువైన భూములకు రూ.1.30 లక్షలకు మించి పరిహారం ఇవ్వడం లేదన్నారు.

ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు స్పందిస్తూ... ‘గిరిజనులను బలవంతంగా తరలించలేదు. వారే స్వచ్ఛందంగా తరలివెళ్లారు. అయిదు వేల మందికి ఇప్పటికే పునరావాసం కల్పించాం. మరో 15 వేల మందికి రెండు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. కాఫర్‌ డ్యాంలో ప్రస్తుతం 25 మీటర్ల మేర నీరు ఉంది. వచ్చే ఏడాది మరింత ఎక్కువగా నిలుపుతాం. వచ్చే ఏడాదికి ముంపు ప్రాంతంలో ప్రభావం ఉంటుంది. అప్పటికి పునరావాస పనులు పూర్తి చేస్తామని..’ పేర్కొన్నారు.

జల్‌శక్తి అధికారులు స్పందిస్తూ... ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల్లో ముంపుపై వచ్చే సమావేశం నాటికి నివేదిక ఇస్తామని, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తామన్నారు. అన్నిపక్షాల వాదనలు విన్న కమిటీ ... ఫిర్యాదుదారులు లేవనెత్తిన అంశాలకు పాయింట్ల వారీగా సమాధానాలు అందజేయాలని ఆదేశించింది. సమీక్షలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాలు, జల్‌శక్తి, సామాజిక న్యాయ సాధికారితశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తాలిబన్లకు షాకిచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.