కొవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్యారోగ్యశాఖపై(cm jagan review on health department news) సీఎం జగన్ సమీక్షించారు. భేటీ లో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని((minister alla nani)), సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత తీర్చడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలపై ఆరా తీశారు.
గడువులోగా పూర్తి చేయాలి
ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల నియామకానికి ఆమోద ముద్ర వేశారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,391 కుపైగా పోస్టులను భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ (recruitment in ap medical department) ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి ఉద్యోగుల నియామక ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నామని, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉందని సీఎం అన్నారు. ఏళ్ల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నామన్న సీఎం.. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
వెంటనే నియమించండి
వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలన్నారు సీఎం జగన్(cm jagan news). ప్రభుత్వారోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలని, ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. కావాల్సిన సిబ్బంది వెంటనే నియమించాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలన్నారు. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా దీనికి తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలన్నారు. ఓ డాక్టరు సెలవు పెడితే రోగులకు వైద్యం అందని పరిస్థితి, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.
రాత్రి కర్ఫ్యూ యథాతథం
థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్య్టా సన్నద్దంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వ్యాకినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. 3 జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా(night curfew in andhra pradesh news) అమలు చేయాలని ఆదేశించారు. పాజిటివిటీ రేటు ఎక్కుగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. కొవిడ్ నిబంధనలును కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియే కొవిడ్ సమస్యకు పరిష్కారమన్న సీఎం.. దీన్ని వేగవంతం చేయాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
'అక్టోబర్ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలి. నవంబర్ 15 నాటికి ఉద్యోగాల భర్తీని ముగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దు' - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండి