ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr letter to pm modi) లేఖ రాశారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని కోరిన సీఎం.. 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ నిబంధన పెంచాలని విజ్ఞప్తి చేశారు. 2021-22 ఖరీఫ్‌లో 90 శాతం ధాన్యం సేకరించాలని.. కొనుగోలుపై ఎఫ్‌సీఐకి తగిన ఆదేశాలివ్వాలని తన లేఖలో కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధానంగా విన్నవించారు.
ఎంత కొంటారో చెప్పండి..
వచ్చే రబీలో తెలంగాణ నుంచి ఎంత కొంటారో తెలపాలని (cm kcr writes to pm modi) మోదీని కోరారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని.. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదని ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2021 ఖరీఫ్‌లో 55.75 లక్షల (cm kcr seeks clarity on paddy procurement) టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. కేవలం 32.66 లక్షల టన్నులే ఎఫ్‌సీఐ సేకరించిందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. 2019-20 ఖరీఫ్‌తో పోలిస్తే 78 శాతం తక్కువగా సేకరణ జరిగిందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసినా..
ధాన్యం సేకరణ లక్ష్యంపై సెప్టెంబర్‌లో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను కలిసినట్లు ప్రధాని చెప్పిన సీఎం కేసీఆర్.. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యం నిర్ధరించాలని విజ్ఞప్తి చేసినట్లు తన లేఖలో పేర్కొన్నారు. విజ్జప్తి చేసి 50 రోజులు దాటినా తమకు ఎటువంటి సమాచారం లేదని.. ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలుపై సత్వరమే చర్యలు (cm kcr seeks clarity on paddy procurement) తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు.
కేంద్రంపై ఫైర్..
ధాన్యం కొనుగోళ్లు, వరి సాగు వ్యవహారంపై కేంద్రం తీరుపై నిన్నటి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. గురువారం మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రమంత్రివర్గం సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు ధర్నా చేస్తామన్నారు. ఈనెల 20వ తేదీ వరకు కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తామని.. వారి నుంచి ఉలుకు పలుకు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు స్పష్టమైన వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. అన్ని వేదికలపైనా కేంద్రం తీరును నిలదీస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. కొనుగోళ్ల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రైతులపై భాజపా నేతలు దాడి చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వరి సాగు చేయాలంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: