ఈ నెల 9 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్ పర్యటన ఖరారైంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. నవంబర్ 9 తేదీ సాయంత్రం 5 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రులు ఒడిశా సీఎం నివాసంలోనే సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన నేరడి బ్యారేజీ అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, పరిహారం చెల్లింపు, నీటి వాటాలకు సంబంధించిన అంశంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్యా వివాదంగా మారుతున్న సరిహద్దు గ్రామాల అంశంపై కూడా చర్చించనున్నారు.
సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం జగన్ ఒడిశా ముఖ్యమంత్రితో భేటీ అనంతరం భువనేశ్వర్ నుంచి అదే రోజు రాత్రి 9 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై మద్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో సీఎం భువనేశ్వర్ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: