ETV Bharat / city

Jagan: బడికో ఇంగ్లిష్‌ ల్యాబ్‌.. రెండేళ్లలో విద్యకు రూ.32,714 కోట్లు! - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. మనబడి నాడు-నేడు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. జగనన్న విద్యాకానుక ప్రారంభకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రతిఒక్కరూ చదువుకోవాలని..డిగ్రీ, వృత్తి విద్యను హక్కుగా చదువుకునేలా విద్యావ్యవస్థను మారుస్తున్నట్లు తెలిపారు.

బడికో ఇంగ్లిష్‌ ల్యాబ్‌
బడికో ఇంగ్లిష్‌ ల్యాబ్‌
author img

By

Published : Aug 17, 2021, 7:07 AM IST

Updated : Aug 17, 2021, 7:39 AM IST

పి. గన్నవరంలో సీఎం జగన్ పర్యటన

‘పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువే. పోటీ ప్రపంచంలో వారి కాళ్లపై వాళ్లు నిలబడాలి. అందుకే వారికి మంచి జరగాలని, పేదింటి పిల్లలు చదువనే అస్త్రంతో పేదరికాన్ని దాటాలని కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోమవారం ‘మన బడి నాడు-నేడు’ మొదటి దశ పనులను విద్యార్థులకు అంకితం ఇవ్వడం, రెండోదశ పనులకు శంకు స్థాపన, జగనన్న విద్యా కానుక ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో విద్యా పథకాలకు గత రెండేళ్లలో రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. డిగ్రీ, వృత్తి విద్యను హక్కుగా చదువుకునేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల రూపురేఖలను మార్చి.. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం. విద్యా కానుకలో ప్రతి విద్యార్థికి మంచి స్కూలు బ్యాగు, పుస్తకాలు, డిక్షనరీ ఇస్తున్నాం. రెండేళ్లలో విద్యా కానుకకు రూ.1,380 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది 42.32 లక్షల మందికి రూ.731 కోట్లతో కిట్లు ఇస్తున్నాం. గతేడాది లోపాలను సవరించి నాణ్యతతో కూడిన వస్తువులు ఇస్తున్నాం. నాడు-నేడు తొలిదశ 15,700 పాఠశాలల్లో పూర్తిచేసి.. రెండో దశకు శ్రీకారం చుట్టాం. రూ.16 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి.

ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిషు లాంగ్వేజ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. సినిమాలు, గేమ్స్‌ ద్వారా ఆంగ్లంపై పట్టు పెంచేలా ల్యాబ్‌లు పెడతాం. రెండేళ్ల కార్యక్రమాలతో పదో తరగతిలోపు పిల్లలు గత ప్రభుత్వ హయాంలో 2018-19లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి 70.43 లక్షల మంది ఉంటే... ఆ సంఖ్య ఇప్పుడు కొవిడ్‌ ఉన్నా 73.05 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే అప్పట్లో 37.20 లక్షల మంది చదివితే.. ఇప్పుడా సంఖ్య 43.43 లక్షల మందికి చేరింది. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాలని ఆదేశించాం. సచివాలయం యూనిట్‌గా 10 శాతం కంటే పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నచోటే బడి తెరవాలి. ఒక్కో తరగతి గదిలో 20 మందికి మించి ఉండకూదని ఆదేశాలిచ్చాం. ఎక్కువ మంది ఉంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలి. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ వేయించాం’ అని సీఎం తెలిపారు.

అక్షర సేద్యమిది: మంత్రి సురేష్‌

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గత పాలకులు పాఠశాలల్లో మౌలిక వసతులు విస్మరించి ప్రైవేటు విద్యను ప్రోత్సహించారని విమర్శించారు. సీఎం జగన్‌ అక్షర సేద్యం చేస్తూ ప్రభుత్వ విద్యాలయాల రూపునే మార్చారని అన్నారు. పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ ఇంత అభివృద్ధి జరగలేదన్నారు.

కార్యక్రమంలో భవిత కేంద్రాన్ని, నాడు-నేడు పనులను సీఎం పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. నాడు-నేడు పనులకు వినియోగిస్తున్న సామగ్రి, విద్యా కానుక కిట్ల నాణ్యత పరిశీలించారు. వార్షిక విద్యా ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాడు- నేడు కార్యక్రమంలో ప్రతిభ చూపిన ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్‌ సిబ్బందికి అవార్డులు అందించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు అనురాధ, మార్గాని భరత్‌, మాధవి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

థాంక్యూ మావయ్యా..

ముఖ్యమంత్రి సభా వేదికపై ఇద్దరు చిన్నారుల ప్రసంగం ఆకట్టుకుంది. ‘థాంక్యూ మావయ్య’ అంటూ సాగిన వారి ప్రసంగానికి సీఎం ముగ్ధులై దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు.

పాఠశాల రూపు మారింది

‘మా నాన్న హెచ్‌ఎం. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా. రెండో తరగతి చదువుతున్నప్పుడు నాకు 23 మంది స్నేహితులుంటే.. ఇప్పుడు 88 మంది ఉన్నారు. పాఠశాలలో చేరే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇందుకు పథకాలే కారణం. గతంలో మరుగుదొడ్ల ఆవరణ అధ్వానంగా ఉంటే ఇప్పుడు అందంగా మార్చారు’.

- శ్రీప్రణవి, ఐదో తరగతి, మొగలికుదురు

ఆడపిల్లలకు దిశతో రక్ష

‘సీఎం జగన్‌ మావయ్య ఆడపిల్లల రక్షణ కోసం దిశ యాప్‌ తెచ్చారు. పాఠశాల రూపురేఖలే మార్చారు. జగనన్న విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అందించారు. మా నాన్న టైలర్‌, అమ్మ గృహిణి.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఇద్దరూ లబ్ధిపొందారు’

- సాయిశరణ్య, పదోతరగతి జడ్పీ ఉన్నత పాఠశాల, పి.గన్నవరం

భవిష్యత్తులో 6 రకాల పాఠశాలలు..

రాష్ట్రంలోని 57 వేల పాఠశాలలను ఆరు కేటగిరీలుగా విభజించి ‘నాడు- నేడు’కు అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

1. శాటిలైట్‌ ఫౌండేషన్‌: గ్రామ శివారు ప్రాంతాల్లోని పాఠశాలలను శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా మారుస్తాం. ఫౌండేషన్‌ స్కూళ్లకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయి.

2. ఫౌండేషన్‌ స్కూళ్లు: గ్రామం నుంచి కి.మీ. దూరంలో ఫౌండేషన్‌ స్కూళ్లు రాబోతున్నాయి. ప్రీపైమరీ(పీపీ) 1, 2తోపాటు ఒకటి, రెండు తరగతులు ఈ పరిధిలో ఉంటాయి.

3. ఫౌండేషన్‌ స్కూలు ప్లస్‌: పీపీ 1, 2, ఒకటి నుంచి అయిదు తరగతులు ఉంటాయి.

4. ప్రీహైస్కూలు: మూడు నుంచి ఏడు లేదా ఎనిమిదో తరగతి వరకు ఉంటుంది.

5. హైస్కూల్స్‌: ఈ పరిధిలో మూడు నుంచి పదో తరగతి వరకు ఉంటాయి.

6. హైస్కూలు ప్లస్‌: మూడు నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది.

ఇదీ చదవండి:

Ramya Murder: అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

Last Updated : Aug 17, 2021, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.