ETV Bharat / city

CM Jagan Kurnool Tour: ఈనెల 22న కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ - కర్నూలు జిల్లాలో జగన్ పర్యటన

CM Jagan Kurnool Tour: ఈనెల 22న ముఖ్యమంత్రి జగన్.. కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

cm jagan to visit kurnool
cm jagan to visit kurnool
author img

By

Published : Dec 19, 2021, 9:36 PM IST

CM Jagan Kurnool Tour: ఈనెల 22న కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు... శివ నరసింహారెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కర్నూలు నగరానికి సమీపంలోని పంచలింగాల మాంటిస్సోరి పాఠశాలలో వివాహం జరగనుంది. ఉదయం 11:15 గంటలకు కర్నూలు విమానాశ్రయం ముఖ్యమంత్రి చేరుకుంటారు. వివాహం అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు తాడేపల్లికి బయల్దేరుతారు.

21న తణుకులో పర్యటన..

CM JAGAN TOUR: ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. సంపూర్ణ భూ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు తణుకులోని మహిళా కళాశాల ఎదురుగా వ్యవసాయ భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచి బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సభకు సీఎం చేరుకుంటారు. మార్గమధ్యలో జగన్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనుపరాడ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

పర్యటన ముందస్తు చర్యల్లో భాగంగా 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్ తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసు ద్వారా సమాచారం అందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనివిధంగా పూర్తిస్థాయి భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

LIVE Video : క్షణాల్లో కాలి బూడిదైన కారు.. సోషల్ మీడియాలో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.