రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం భేటీ కానున్నారు. గవర్నర్‌కు వ్యక్తిగతంగా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు.
దాదాపు 30 నిముషాల సేపు ముఖ్యమంత్రి జగన్ రాజ్‌భవన్‌లో గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించుకోనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి