ETV Bharat / city

Jagan Review: కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష

రాష్ట్రంలోని పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని... సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ఎక్కడా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిపై చర్చించిన సీఎం.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సత్వరమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంశధారపై నేరడి బ్యారెజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష
పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష
author img

By

Published : May 28, 2021, 3:41 PM IST

Updated : May 28, 2021, 5:09 PM IST

జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టులు, ఏపీ గోదావరి కృష్ణ సలైనటీ మిటిగేషన్‌, వాటర్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరవు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష(CM Review) జరిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈనెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తిచేశామని, వీటికి సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తిచేశామని అధికారులు తెలిపారు. కాఫర్‌ డ్యాంలో 1,2 రీచ్‌లు జూన్‌ నెలాఖరు నాటికి, కాఫర్‌ డ్యాంలో 3,4 రీచ్‌ పనులు జులై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన పనులనూ వేగవంతంగా చేయాలని సీఎం ఆదేశించారు.

కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్(CM Jagan) సమీక్షించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీఎం(CM) తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టన్న ముఖ్యమంత్రి... యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నామని ఉద్ఘాటించారు. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగ్​లో ఉండడం సరికాదని, అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. చేసిన ఖర్చు వెంటనే రీయంబర్స్‌ అయ్యేలా చూడాలన్నారు. వచ్చే మూడు నెలల కాలానికి కనీసం 1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నట్లు సీఎం తెలిపారు. దిల్లీ వెళ్లి వెంటనే పెండింగ్లో​ ఉన్న బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖ రాశామని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ తెలిపారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. సంగం బ్యారేజీ పనులు 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామన్న అధికారులు, ఇంకా 180 మీటర్ల పని ఉందన్నారు. వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌–1 పూర్తిగా సిద్ధమైందని అధికారులు తెలిపారు. టన్నెల్‌ –1 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు దాదాపుగా పూరైనట్టు తెలిపారు. టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆలస్యం కాకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని సీఎం సూచించారు. రెండో టన్నెల్‌ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని సూచించారు. వచ్చే సమావేశానికి ప్రణాళికతో రావాలని ఆదేశించారు.

వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌ –2 పనులపైనా సీఎం జగన్ సమీక్షించారు. పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని, పనులు ఆలస్యంకావడానికి వీల్లేదన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. బ్రహ్మసాగర్‌ సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నిల్వ చేయడానికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Last Updated : May 28, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.