మనబడి నాడు - నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండోవిడత నాడు - నేడు పనులకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 15 నుంచి రెండోవిడత నాడు - నేడు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. డిసెంబరు 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. రెండోవిడత నాడు - నేడు పనులకు రూ.4,446 కోట్లు అవుతాయని అంచనా వేశారు.
పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరుపై సీఎం జగన్ వివరాలు కోరారు. విద్యార్థులు బడికి రాకుంటే తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ వెళ్లాలన్న ముఖ్యమంత్రి.. గోరుముద్ద, మధ్యాహ్న భోజనం పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపిన సీఎం.. టాయిలెట్ల నిర్వహణకు 49 వేల మంది సిబ్బంది అవసరమవుతారని చెప్పారు. టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండీ... మంత్రుల సమక్షంలో రసాభాస.. బైరెడ్డి వర్సెస్ ఆర్థర్