ETV Bharat / city

కోలుకున్న వారి సంఖ్య పెరిగింది : సీఎం జగన్

కరోనా నివారణ కార్యాచరణపై సీఎం జగన్.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నిర్ధరణ పరీక్షలు ఏపీలోనే ఎక్కువగా జరిగాయన్నారు. ఇప్పటి వరకూ 1,65,069 పరీక్షలు చేశామని చెప్పారు. వ్యాధి నుంచి కోలుకుంటున్నవారు పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : May 9, 2020, 2:32 PM IST

Updated : May 10, 2020, 6:39 AM IST

రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల కంటే.. వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు తెలిపారు. శుక్రవారం 43 కొత్త కేసులు నమోదవగా, ఆస్పత్రుల నుంచి 45 మంది డిశ్ఛార్జి అయినట్టు వెల్లడించారు. శుక్రవారం నమోదైన కేసుల్లో 31.. పాత క్లస్టర్ల నుంచే వచ్చాయన్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్షించారు. కరోనాతో ఎవరూ చనిపోయే పరిస్థితి తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

అధికారులు వెల్లడించిన అంశాలు

  • చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చినవారి వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి.
  • కోయంబేడుకు వెళ్లిన రైతులతో పాటు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
  • కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లలో ఉన్నవారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నాం. వైరస్‌ వ్యాప్తిని దాదాపు ఆ క్లస్టర్లకే పరిమితం చేయగలిగాం.
  • 700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారు. వారి వివరాలు కనుక్కొని పరీక్షలు నిర్వహిస్తాం.
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారితో వైరస్‌ ముప్పు పొంచి ఉంది. ఐసోలేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టాం.
  • రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే కరోనాతో మరణిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్టు అనుమానం వచ్చిన వెంటనే సమాచారమిస్తే ఈ ముప్పు తప్పుతుంది.
  • ప్రతి పది లక్షల జనాభాకు 3,091 నిర్ధరణ పరీక్షలు చేశాం. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
  • శుక్రవారం ఒక్కరోజే 8,388 పరీక్షలు నిర్వహించాం.
  • రాష్ట్రంలో పాజిటివిటీ శాతం 1.17 కాగా, దేశంలో అది 3.92గా ఉంది.
  • రాష్ట్రంలో మరణాలు 2.28 శాతం కాగా దేశంలో 3.3 శాతం.
  • టెలిమెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దాదాపు 500 కాల్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రోగులు ఫోన్‌ చేసిన 24 గంటల్లోగా ఔషధాలు అందేలా చూస్తాం.
    రొయ్యలు, చేపల మేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఎల్జీ పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో స్థానికులు ఆందోళన

Last Updated : May 10, 2020, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.