కరోనా వేగంగా విస్తరిస్తున్న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం... వైరస్ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై మార్గనిర్దేశం చేశారు. కర్నూలు, గుంటూరులో ప్రతి వీధి చివరన నిత్యావసరాలు ఉంచాలన్న సీఎం... కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నంద్యాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డయాలసిస్ రోగులకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసర సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎంకు చెప్పిన అధికారులు... టెలీ మెడిసిన్‌ను సంప్రదిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని వివరించారు. టెలీమెడిసిన్‌ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: ఆ మందును పిచికారీ చేస్తే శరీరానికి మంచిదేనా?