ETV Bharat / city

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును 14నెలల్లో పూర్తి చేయాలి: సీఎం - ap cm jagan latest news

అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులను 14 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పనులను మొదలుపెట్టాలని సూచించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Nov 3, 2020, 9:28 PM IST

విజయవాడ స్వరాజ్ మైదాన్​లో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ ఏర్పాటు పనులను 14నెలల్లో పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాంస్య విగ్రహం, స్మృతివనం పనులను వచ్చే నెలలో మొదలుపెట్టాలన్నారు. అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం... 2022 ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించారు.

భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనానికి సంబంధించి రెండు రకాల ప్లాన్ల్​లను పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ‌ద్వారా అధికారులు సీఎంకు వివరించారు. నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్‌ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్‌ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను అధికారులు చూపించారు. గ్యాలరీ, ఆడిటోరియం‌ ఎలా ఉంటుందన్న దానిపైనా అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా తెలిపారు. అంబేడ్కర్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం నాణ్యత దీర్ఘకాలం ఉండాలని, నిర్మాణంలో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.

ఇదీ చదవండి

తుంగభద్ర తీరాన ఇసుక కూలీల బతుకు పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.