ETV Bharat / city

రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు - sand problems in ap latest news

రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా  ఇసుక వారోత్సవాలు జ‌ర‌పాల‌ని నిర్ణయించింది. దీనితో పాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా కఠిన చర్యలకు  తీసుకుంటోంది. అక్రమార్కులకు  రెండేళ్ల జైలు శిక్ష వేసేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా నేటి మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణయం తీసుకోనుంది.

sand
author img

By

Published : Nov 13, 2019, 5:05 AM IST

రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు

ఇసుక స‌మ‌స్యల పరిష్కారం కోసం ఈనెల 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ మేరకు అదేశాలు జారీ చేశారు. ఇప్పటికే న‌దుల్లో వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టినందున ఇసుక లభ్యత మరింత పెరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే వారానికి రోజుకు 2 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.
కొరత తీరే వరకు సెలవులు పెట్టకండి
న‌వంబ‌ర్ 14 నుంచి 21 వ‌ర‌కు జ‌రిగే వారోత్స‌వాల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా ఇసుక పైనే దృష్టి పెట్టాలని సీఎం జ‌గ‌న్ అదేశించారు. ఇప్పటికే ఇసుక త‌ర‌లింపునకు జాయింట్ కలెక్టర్లను ఇన్‌ఛార్జ్​లుగా పెట్టామని.. వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలన్నారు. ఇసుక వారోత్సవం అయ్యేలోపు 180కి పైగా స్టాక్‌ పాయింట్లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. గురువారంలోగా ఇసుక‌ రేటు కార్డు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా కూడా ఇసుక‌ రేటు కార్డును ప్రకటించాలన్నారు. ఇసుక కొరత తీరేవరకూ సిబ్బంది సెలవులు తీసుకోవద్దని కోరారు. ఇసుక త‌వ్వకాలు జ‌రిపే ప్రాంతాలతో పాటు స్టాక్ పాయింట్ల వ‌ద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ప్ర‌తి చోటా చెక్​పోస్టులు ఏర్పాటు చేసేలా, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్‌ బీ, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్లు జైలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించిన ఇసుక ధ‌ర‌లు కంటే ఎవ‌రైనా ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్మినా, అక్రమ రవాణా చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. బుధవారం మంత్రి వ‌ర్గ స‌మావేశంలో అర్డినెన్స్ తెచ్చేలా ప్ర‌తిపాద‌నలు తీసుకురావాల‌ని ఉన్న‌తాధికారుల‌ను సీఎం జ‌గ‌న్ అదేశించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.