ETV Bharat / city

CM REVIEW:రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందేలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ప్రోత్సహించాలని రహదారి భద్రత మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని, ఇందుకోసం కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

CM REVIEW
CM REVIEW
author img

By

Published : Feb 15, 2022, 4:16 AM IST

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందేలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులను ప్రోత్సహించాలని రహదారి భద్రత మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని, ఇందుకోసం కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న 16 వైద్య కళాశాలల్లో ట్రామా కేర్‌ సెంటర్లు ఉండాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తెచ్చేవారికి మద్దతు ఇవ్వాలి. బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రహదారులపై లైన్‌ మార్కింగ్‌ స్పష్టంగా ఉండాలి. ద్విచక్ర వాహనాలు, కార్లకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి. వాహనాలు ఎంత వేగంతో వెళ్లాలి అనేదానిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వీటివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రహదారుల పక్కన ఉండే దాబాల్లో మద్యం విక్రయించకుండా చూడటం ద్వారా కూడా ప్రమాదాలు తగ్గుతాయి. ప్రధాన రహదారులకు పక్కన యాక్సెస్‌ బ్యారియర్లు ఉండాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలి. జిల్లా స్థాయిలోనూ సమీక్షలు నిర్వహించాలి. ఇలా అయితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా రిహాబిలిటేషన్‌ కేంద్రాన్ని విశాఖలో ఉంచాలి. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో ఉన్న కేంద్రాన్ని మెరుగుపరచాలి’ అని సూచించారు. రహదారి భద్రతకు సంబంధించి లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. ఇందులో పోలీసు, రవాణా, వైద్య, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ నిపుణులు ఉంటారు. అలాగే రహదారి భద్రత నిధి ఏర్పాటుకు కూడా సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలో రహదారులపై 1,190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించగా, వీటిలో 520 సరి చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తున్న జాతీయ రహదారుల్లో 78 బ్లాక్‌ స్పాట్స్‌ సరి చేశామని వారు చెప్పారు.

బీచ్‌ కారిడార్‌ రహదారికి ప్రాధాన్యం: సీఎం

విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం విమానాశ్రయం మీదుగా ఎన్‌హెచ్‌-16కి అనుసంధానం చేసే బీచ్‌ కారిడార్‌ రహదారికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, దీని డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వీలైనంత త్వరగా చేరుకునేలా బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలి. ఈ రహదారికి ఆనుకొని పర్యాటక ప్రాజెక్టులు వస్తాయి’ అని తెలిపారు.

* రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.2,205 కోట్లు వెచ్చిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో ఎన్నడూ ఇంత డబ్బులు ఇవ్వలేదని సీఎం జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వంలో రహదారుల నిర్వహణ పట్టించుకోలేదని, తర్వాత వర్షాలు బాగా కురవడంతో రోడ్లు మరింత దెబ్బతిన్నాయని చెప్పారు. అయినా ఈ ప్రభుత్వ హయాంలోనే రహదారులన్నీ పాడైనట్లు ప్రచారం చేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్వోబీలు పూర్తిచేసేందుకు రూ.571 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటి వరకు రహదారుల పనుల టెండర్లు 83 శాతం పూర్తిచేశామని, ఈ నెలాఖరుకు 100 శాతం పూర్తవుతాయని అధికారులు వివరించారు. మే చివరికి రహదారుల నిర్మాణం, మరమ్మతులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో ఆర్‌అండ్‌బీ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, రవాణా, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు, కుమార విశ్వజిత్‌, న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత, రవాణాశాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

12-18 ఏళ్ల పిల్లలకు కార్బెవాక్స్​ అత్యవసర వినియోగానికి సిఫార్సు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.