ETV Bharat / city

Bhatti Vikramarka: 'దారుణం జరిగి మూడ్రోజులైంది.. పోలీసులు ఏం చేస్తున్నారు' - vanama raghava

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులైనా.. పోలీస్​ యంత్రాంగం ఏం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka
author img

By

Published : Jan 6, 2022, 4:18 PM IST

Bhatti Vikramarka: వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులైనా.. పోలీస్​ యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ అవసరాలకే వాడుకుంటున్నారని భట్టి ఆరోపించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలన్నీ కూడా కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చాయని అన్నారు.

'ఆత్మహత్యకు పాల్పడి మూడ్రోజులైంది.. పోలీసులు ఏం చేస్తున్నారు'

ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజలంతా స్వేచ్ఛాయుత తెలంగాణను కోరుకుంటున్నారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అధికార పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని అన్నారు. ప్రతిపక్షాలను ఖూనీ చేయడానికే పోలీసులను వాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులైంది. అయినా.. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది?. పోలీస్ వ్యవస్థను పార్టీ అవసరాలకే వాడుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. ప్రజలంతా స్వేచ్ఛాయుత తెలంగాణను కోరుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.