ఎట్టకేలకు 8వ తరగతి విద్యార్థులు బడి బాట పట్టారు. ఈ రోజు నుంచి వారికీ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.ఆ దిశగా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం 9, 10 తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండగా.. చలి తీవ్రత పెరగడంతో సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే నిర్వహించనున్నారు.
10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు ఉంటాయి. 8, 9 తరగతుల వారికి రోజు విడిచి రోజు (వారంలో చెరో మూడు రోజులు) తరగతులకు హాజరవుతారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగనున్నందున.. విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: