ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు . అదే రోజు ఏపీ హైకోర్టుకు రానున్నారు . హైకోర్టు న్యాయవాదుల సంఘం , బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఏపీ హైకోర్టుకు రావడం ఇదే మొదటి సారి. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ పి . నరసింహ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు . ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు , ఏపీ హై కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి హైదరాబాద్లో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు . హై కోర్టును సందర్శించాలని ఆహ్వానించారు.
24న సొంతూరికి.. సీజేఐగా తొలిసారి
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 24వ తేదీన కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పొన్నవరం వెళ్లనున్నారు . సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరు రానున్నడం విశేషం . 25 తేదీన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు . 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఏపీలో ఉంటారు .
ఇదీ చదవండి: srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ పై.. సస్పెన్షన్ వేటు