ETV Bharat / city

"మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి! - చైనా

"బంగారం.. నీ దోస్తులెక్కడ.. నీ కొలీగ్స్ ఎక్కడ..? అని, నాకు కాబోతున్న భర్త, పేరెంట్స్, బంధువులు.. గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. నేను ఏమని చెప్పను? మీరు వస్తారని చెప్పనా.. రావట్లేదని చెప్పనా? అసలు మీరు వస్తారో రారో.. నాకే తెల్వకపోతే.. ఇక, నేను వాళ్లకేం చెప్పను? కానీ.. ఒకటి చెప్పనా.. చెట్టుకు నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది.. అట్లనే మీరు కూడా నా మనసేంటో అర్థం చేసుకుంటేనే కదా.. మీరు నా దోస్తులయ్యేది(!) ఛీ.. పోండ్రా..."

రోధిస్తున్న యువతి
రోధిస్తున్న యువతి
author img

By

Published : Sep 11, 2022, 1:36 PM IST

Updated : Sep 11, 2022, 2:54 PM IST

చైనాలో ఒక యువతి.. ఐదేళ్లుగా ఓ ఆఫీసులో పని చేస్తోంది. అందరితో కలిసిపోయే రకం. కుళ్లు, కుతంత్రాలు వంటివి తెలియదు. స్వచ్ఛంగా నవ్వుతూ.. అందరూ తనవాళ్లుగా భావించేది. ఆమె పని చేస్తున్న ఆఫీసులో మొత్తం 70 మంది స్టాఫ్ ఉన్నారు. వీరందరితో కలివిడిగా ఉండేది. ఈ డెబ్భై మందిలో దాదాపు మూడొంతుల మంది పెళ్లిళ్లకు వెళ్లింది. అంటే.. ఆల్మోస్ట్ తాను ఆఫీసులో చేరిన తర్వాత జరిగిన అందరి పెళ్లికీ వెళ్లింది. వన్ ఫైన్ డే.. ఈ యువతికి సైతం పెళ్లి కుదిరింది. ఎవరి జీవితంలోనైనా పెళ్లి అద్భుత ఘట్టం. ఆ రోజున తన వాళ్లు అనుకునే వారు ఆ సంతోషంలో భాగం కావాలని అందరూ కోరుకుంటారు. ఈ యువతి రెండింతలు ఎక్కువగానే కోరుకుంది.

రోధిస్తున్న యువతి
రోధిస్తున్న యువతి

ఆఫీసులోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచింది. చాలా మంది ఒక్క కార్డుపై డిపార్ట్ మెంట్ పేరు రాసి.. "వెల్కమ్ ఆల్" అని మెన్షన్ చేస్తే.. ఈమె మాత్రం ప్రతి ఒక్కరికీ శుభలేఖ అందించింది. ఎవరినైనా మరిచిపోతే.. వారు ఫీలవుతారేమోనని.. గుర్తు తెచ్చుకొని మరీ.. ఆహ్వానించింది. తప్పకుండా ఫ్యామిలీతో రావాలని కోరింది. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. తన ఆఫీస్ మేట్స్ కి ఎలాంటి లోటూ రాకుండా చూసుకోవాలని తన వాళ్లకు స్పెషల్ గా చెప్పింది. భర్తకు సైతం తన సహోద్యోగుల గురించి గొప్పగా చెప్పింది.

రోధిస్తున్న యువతి
రోధిస్తున్న యువతి

అందుకు అనుగుణంగానే.. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించింది. పెళ్లిలో పరిచయస్తులు, బంధువుల సంగతి ఎలా ఉన్నా.. దోస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తాను పెళ్లిలో బిజీగా ఉండిపోతే.. తన దోస్తులను చూసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని ముందుగానే.. వారికి కావాల్సినవన్నీ సిద్ధం చేయించింది ఆ యువతి. గ్రాండ్ గా డిజైన్ చేసిన.. 6 టేబుల్స్ ను మిత్రుల కోసం రిజర్వ్ చేసింది. వాటిని ఎవరికీ కేటాయించొద్దని స్ట్రిక్ట్ గా చెప్పేసింది. ఈ భారీ టేబుళ్ల పరిధిలో కంఫర్ట్ గా ఉండే 70 కుర్చీలను ఏర్పాటు చేయించింది. ఇక, తిండీ తిప్పల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆల్ వెరైటీస్.. కావాల్సినంత కుమ్మేసేలా సప్లై చేయాలని ఆదేశించి, పెళ్లి మండపంలోకి వెళ్లిపోయింది. పెళ్లి తంతు కొనసాగుతోంది.. కొనసాగుతోంది.. కొనసాగుతూ..నే ఉంది.. చివరికి ముగిసింది!

పెళ్లిలో చేసిన ఏర్పాట్లు
పెళ్లిలో చేసిన ఏర్పాట్లు

సీన్ కట్ చేస్తే.. ఆమె రిజర్వ్ చేసిన 70 సీట్లలో.. ఒకే ఒక్క సీటు మాత్రమే నిండింది. ఆ వచ్చిన వ్యక్తి కూడా.. ఆమె కింద పనిచేసే ట్రైనీ..! బహుశా.. మేడం పెళ్లికి వెళ్లకపోతే ఇబ్బంది అవుతుందేమోనని భయపడి వచ్చి ఉంటాడు. అవమానం..! ఘోర అవమానం..!! తన వాళ్ల ముందు.. భర్త ముందు మౌనంగా తల దించుకుంది. మనసులో రోదించింది.. ఆ పరిస్థితిని ఎంత మాత్రమూ జీర్ణించుకోలేకపోయింది.

పెళ్లిలో చేసిన ఏర్పాట్లు
పెళ్లిలో చేసిన ఏర్పాట్లు

"ఇంతకాలం నేను కలిసి పనిచేసింది ఇలాంటి వాళ్లతోనా? అందరూ నా వాళ్లు అనుకున్నాను. కానీ.. మీ మనసులో నా స్థానం ఏంటో నాకు ఇవాళ సరిగ్గా అర్థమైంది. మీలాంటి వాళ్లతో ఇక నేను కలిసి పనిచేయలేను. అందుకే.. మీతో స్నేహానికీ.. నా ఉద్యోగానికీ.. రాజీనామా చేస్తున్నాను." అని లెటర్ రాసి.. గుడ్ బై చెప్పిందా యువతి!

రాజీనామా లేఖ
రాజీనామా లేఖ

చైనా సోషల్ మీడియాలో ఈ యువతి కథ వైరల్ అయ్యింది. అయితే.. నెటిజన్స్ రెండుగా చీలిపోయారు. ఒక వర్గం ఆమెకు మద్దతుగా నిలిచారు. అలాంటి ఉద్యోగులను వదిలి పెట్టడమే మంచిది అని అన్నారు. మరో వర్గం మాత్రం ఆమె నిర్ణయంతో ఏకీభవించలేదు. ఆమె వారి నుంచి ఎక్కువగా ఆశించిందని.. ఎక్స్ పెక్టేషన్స్ అతిగా పెట్టుకుంటే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని కామెంట్ చేశారు. మరి, మీరు ఎటువైపు ఉంటారు???

Last Updated : Sep 11, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.